మృతి దేహానికి ఎవరు రాకపోవడంతో మై ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారు అంతక్రియలు నిర్వహించారు

మృతి దేహానికి ఎవరు రాకపోవడంతో మై ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారు అంతక్రియలు నిర్వహించారు

మండలంలోని రాఘవేంద్ర కాలనీ కమలపాడు రోడ్డు నందు నివసిస్తున్న పూస శాంతయ్య భార్య పోసా రంగమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. బంధువులు ఎవరు అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాకపోవడంతో యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారికి సమాచారం ఇచ్చారు. ఫౌండేషన్ సభ్యులు పోసా రంగమ్మ అంత్యక్రియలను సాంప్రదాయ బద్ధంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ, సెక్రటరీ ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, గౌరవాధ్యక్షులు చందగాని ధ్రువ నారాయణ, బడిగించల వేణు, జొన్నల వెంకటేష్, సాయివరపు నాగరాజు, పల్లా ఆంజనేయులు, కాంతమ్మ, పాల్గొనడం జరిగింది.