డ్రగ్స్, మద్యం, పోర్నోగ్రఫీ వెబ్సైట్స్లను నిషేధించాలి
డ్రగ్స్, మద్యం, పోర్నోగ్రఫీ వెబ్సైట్స్లను నిషేధించాలి
ఎన్టీఆర్ - జనచైతన్య న్యూస్
ఎన్టీఆర్ జిల్లాలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రొద్దుటూరు పట్టణంలో జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది.దేశంలో రాష్ట్రంలో అత్యాచారాలు విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తుందని,దేశంలో పది నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి లోనవ్వడం ఒకప్పటి నిర్భయ నుండి నేటి వైద్యుల అత్యాచార సంఘటనలు అన్ని మానవత్వం నశిస్తుందని తెలుస్తుందని స్త్రీల రక్షణ కొరకు ప్రభుత్వం డ్రగ్స్,మద్యం,పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ ను పూర్తిగా నిషేధించాలని,జియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు సఫీయ ఇస్లాహి ఈ నిరసన ర్యాలీలో ఆందోళన వ్యక్తం చేశారు.ఇందులో ముజాహిదా,మోహ్సిన,ఆయేషా కౌసర్,హసీనా,రెహనా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.