సత్య సాయి జిల్లాలో ప్రతి మండలానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నిర్మించాలి
సత్య సాయి జిల్లాలో ప్రతి మండలానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నిర్మించాలి
జనచైతన్య న్యూస్- సత్యసాయి
సత్య సాయి జిల్లా లోని అన్ని మండల్లాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవనాలు నిర్మాణం చేయాలని రాష్ట ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మెయిల్ ద్వార లేక పంపిన ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ బి కదిరప్ప, రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మరియు కరువు ప్రాంతం అయినా సత్యసాయి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చెందిన పేద వర్గాల వారు వివాహాలు శుభకార్యాలు చేసుకోవాలంటే ప్రస్తుత పరిస్థితులలో ఫంక్షన్ హాల్స్ కు లక్షలాది రూపాయలు బాడుగలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సభలు సమావేశాలు నిర్వహించుకోవాలన్న అనువైన స్థలం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనమును నిర్మించడం వలన అన్ని వర్గాల పేద ప్రజలు వివాహాలు శుభకార్యాలు సభలో సమావేశాలు నిర్వహించుకొనుటకు సౌకర్యవంతంగా ఉంటుంది. కావున ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చొరవ చూపి సత్య సాయి జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణాలను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ బి కదిరప్ప ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు కి మెయిల్ ద్వారా ఒక లేఖను పంపడం జరిగిందన్నారు.