గుత్తి మున్సిపాలిటీలో మరి ఇంత ఘోరమా
గుత్తి మున్సిపాలిటీలో మరి ఇంత ఘోరమా
జనచైతన్య న్యూస్-గుత్తి
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్నూలు రోడ్ లోని పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి వీధి నందు ప్రభుత్వ బోరు అధికారులు వెయడం జరిగినది. అయితే బోర్ వేయించే సందర్భంలో వీధిలోని ప్రజలు అభ్యంతరం తెలపడం జరిగినది. వీధిలో రోడ్డుపై బోరు వెయడం వల్ల వీధిలోకి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని తోపుడు బండ్లు, కనీసం ఆటో కూడా రావడానికి వీలు లేకుండా పోతుందని, ఇబ్బంది కలుగుతుందని అభ్యంతరం తెలిపినప్పటికీ బోరు అనంతరం రోడ్డుకి బోర్ ఎటువంటి అడ్డు ఉండదని భూమి లోపలికి సమాంతరంగా చేయడం జరుగుతుందని మాయ మాటలు చెప్పిన మున్సిపాలిటీ అధికారులు ప్రస్తుతం బోరు వేసి రెండు నెలలు కావస్తున్న రోడ్డుకు అడ్డంగా తోగినటువంటి గుంత గాని, బోరు గాని, భూమి సమాంతరంగా చేయడం గాని చేయకపోగా చిన్నపిల్లలు అందులో చాలా మంది పడి గాయాలపాలు కావడం జరిగింది. ఈ విషయం మున్సిపాలిటీ అధికారులకు ప్రజలు తెలియజేయగా రెండు రోజుల క్రితం టెస్టింగ్ పేరుతో బోరుని చెక్ చేస్తున్నామని పూర్తిస్థాయిలో రోడ్డుకు అడ్డంగా బోరు పైపు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంలో వీధిలో ఉన్నటువంటి ప్రజల అభ్యంతరం తెలపడం జరిగితే టెస్టింగ్ మాత్రమే అని చెప్పి పూర్తిస్థాయిలో బోర్ అమర్చడం జరిగింది. ఉదయాన్నే వీధిలో ఎవరు లేని సందర్భంలో చూసి బోరు రోడ్డుకు అడ్డం ఉన్నప్పటికీ బోరు దగ్గర ఉన్నటువంటి గుంతను పూడ్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. విషయాన్ని గమనించిన వీధిలో ఉన్నటువంటి ప్రజలు అడ్డుకోవడం జరిగినది.ఈ సందర్భంగా వీధిలో ఉన్నటువంటి ప్రజలు మరి ఇంత ఘోరంగా అధికారులు ఎలా ఆలోచిస్తారని కనీసం వీధిలోకి అంబులెన్స్ గాని ఆటో గాని తోపుడుబండ్లు గాని రాకుండా రోడ్డుకు అడ్డంగా బోర్ ఎలా వేస్తారు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అని మున్సిపాలిటీ అధికారుల పైన దుమ్మెత్తి పోస్తున్నారు. బోరు వేసినప్పటికీ కనీసం రోడ్డుకి సమాంతరంగానో చేసి వీధిలో ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రయత్నం చేసేది పోయి ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా మరి మున్సిపాలిటీ ఇంత ఘోరంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. మరి గుత్తి మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.