ఆర్టీసీ డిపో విజయవాడ నిజాయితీకి మారుపేరుగా నిలిచినడ్రైవర్ &కండక్టర్
ఆర్టీసీ బస్సులో 10 లక్షల రూపాయల విలువైన నగలు మరిచి బస్సు దిగిన ప్రయాణికురాలు
విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)
నగలు బద్రపరిచి ప్రయాణికురాలుకి ఆందజేసిన ఆర్టీసీ సిబ్బంది, విజయవాడ నుంచి వినుకొండ వస్తున్న ఆర్టీసీ (హైయర్) బస్సు లో సంఘటనవినుకొండ- డీపో కు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి వినుకొండ వస్తూ నరసరావుపేట డీపో లో ప్రయాణికుల కోసం ఆగింది. డ్రైవర్ కు చెప్పకుండా బస్సులోని మహిళ తన చేతి సంచి సీటు లో పెట్టి టాయిలెట్ కోసం బస్సు దిగింది. అది గ్రహించని డ్రైవర్ బస్సు నరసరావుపేట నుంచి వినుకొండ కు బయలుదేరింది. మహిళ టాయిలెట్ నుంచి వచ్చేసరికి బస్సు లేకపోవడంతో కంట్రోల్ పాయింట్ లో తెలిపింది. వెంటనే కంట్రోల్ పాయింట్ సిబ్బంది వినుకొండ డిపో సిబ్బంది కి సమాచారం అందించారు. వినుకొండ డిపో సిబ్బంది డ్రైవర్ కు కండక్టర్ కు సమాచారం అందించారు. కండక్టర్ ఆమె సీటు లోని చేతి సంచి బద్రపరిచి వినుకొండ వచ్చిన తర్వాత మహిళ కు అందజేశారు. సంచిలో ఉన్న నగలు సరిచూసుకొని ఆమే ఆర్టీసీ సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపింది.