నగరాల ఆత్మీయ సమావేశంలో జగన్ రావాలని కృషి-ఆసిఫ్
నగరాలు అభ్యున్నతికి బాటలు వేసింది జగనే -షేక్ ఆసిఫ్
విజయవాడ-జనచైతన్య (తమ్మిన గంగాధర్)
–14 ఏళ్ల టీడీపీ పాలనలో నగరాలను ఘోరంగా అవమానించారు
–నగరాల సామాజిక వర్గాన్ని బీసీలు చేసింది వైఎస్
–అన్ని జిల్లాలకు వర్తింపజేసింది జగన్
–మేయర్‌గా, దుర్గగుడి ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు
నగరాలు సామాజిక వర్గం అభ్యున్నతికి బాటలు వేసింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి షేక్ ఆసిఫ్‌గారు అన్నారు.
శ్రీ నగరాల కులస్తుల రాష్ట్ర బీసీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి కేఎస్ జగన్ ఆధ్వర్యంలో నగరాల సామాజికవర్గ ఆత్మీయ సమావేశం కొరగంజి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నగరాలకు ఏమి మేలు చేసిందనే అంశలతో రూపొందించిన కరపత్రాన్ని ఆసిఫ్‌గారు ఆవిష్కరించారు.
ఈకార్యక్రమానికిముఖ్యఅతిథిగా హజరైన షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ నగరాల సామాజికవర్గానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా నిలిచి వారి అభ్యుదయానికి బాటలు వేశారన్నారు. రాజశేఖరరెడ్డి తన పాలనలో నగరాలు వెనుకబాటునుఎదుర్కొంటున్నారని గ్రహించి వారిని బీసీ జాబితాలో కొన్ని జిల్లాలో గుర్తిస్తూ జీవో ఇచ్చారన్నారు.జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా వచ్చిన తరువాత రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ నగరాలను బీసీలుగా గుర్తిస్తూ జీవో ఇచ్చారన్నారు. దీనివలన నగరాల యువత ఉన్నత విద్యావకాశాలను పొందటమే కాకుండా తద్వారా మంచి ఉపాధి అవకాశాలను పొందేందుకు అవకాశం కలిగిందన్నారు.
రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన విజయవాడకు మేయర్‌గా నగరాల ఆడపడచు రాయన భాగ్యలక్ష్మీనినియమించారన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైన దుర్గగుడికి ఛైర్మన్‌గా పైలా సోమినాయుడుని నియమించారని వివరించారు.
అనేక ప్రధాన ఆలయాలకు, కార్పొరేషన్లకు సభ్యులుగా నియమించారని, పలువురు కార్పొరేటర్లుగా కూడా వచ్చారని గుర్తు చేశారు. వాటితో పాటుగా శ్రీశైలం దేవస్థానం వద్ద సుమారు 50 సెంట్ల స్థలాన్ని నగరాల సామాజికవర్గానికి కేటాయింపు చేశారన్నారు. నగరాల సామాజికవర్గాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ముఖ్యమంత్రిజగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం 14ఏళ్లగా ఉన్నప్పటికీ నగరాలకు ఎటువంటి మేలు చేయలేదని, ఘోరంగా అవమానించారని దానిని గుర్తించాలని కోరారు. నగరాలు, మైనార్టీలు పశ్చిమ నియోజకవర్గంలో సోదరులుగా జీవిస్తున్నారని చెప్పారు.
గతంలో నగరాల సామాజికవర్గ ప్రజాప్రతినిధులకు మైనార్టీలు అండగా ఉన్నారని, అలాగే ముస్లిం ఎమ్మెల్యేలకు నగరాలు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ సారి తనకు జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారని తనను ఆశీర్వదించాల్సినదిగా కోరారు. చేసిన మేలు నగరాలు మర్చిపోరు : కేఎస్ జగన్
నగరాల సామాజికవర్గం తమకు మేలు చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోరని కేఎస్ జగన్ అన్నారు. తమ ఎదుగుదలకు బీసీ గుర్తింపు ద్వారా బాటలు వేసి, తమ పిల్లలు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఎదగటానికి కారణమైన జగన్‌మోహన్‌రెడ్డికి నగరాలు అండగా ఉంటారని చెప్పారు. ముఖ్యంగా తమ సామాజికవర్గం బీసీలుగానే కాకుండా రాజ్యాధికారంలో భాగస్వాములను చేసేందుకు అవకాశం కల్పిస్తున్న జగన్‌కు తామంతా అండగా ఉంటామని, ఆ దిశగా తాము ప్రచారం చేస్తామని వివరించారు. జిల్లాలో తమ సామాజికవర్గం సుమారు 50వేలు ఉన్నారన్నారు. పశ్చిమంలో ఆసిఫ్‌కు, పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని గెలుపుకు అండగా ఉంటామని వివరించారు. కార్యక్రమంలో దుర్గ కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ కొరగంజి భాను, నాయకులు పోతిన వరప్రకాష్, ముదిలి మోహనరావు, ఇద్దిపిల్లి పవన్‌కుమార్, కే నాగేశ్వరరావు, బీసీ నేతలు రంగారావు, కే హేమంత్ తదితరులు పాల్గొన్నారు.