స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తితో,గన్నవరం శాసన సభ్యులు యార్లగడ్డ వెంకటరావు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తితో,గన్నవరం శాసన సభ్యులు యార్లగడ్డ వెంకటరావు
జనచైతన్య న్యూస్- ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లాలో ప్రజానీకానికి,పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని సాగనుంది. ఈ నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోస్టల్ ద్వారా సందేశాన్ని పంపారు.మంగళవారం విజయవాడ శాసన సభ్యుని కార్యాలయంలో ఈ పోస్ట్ కార్డ్ సందేశాన్ని,జాతీయ జెండా ను విజయవాడ పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్వయం గా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు కు అందచేశారు.ఈ ఆగస్టు 15 న తిరంగాను ఎగురవేసి తిరంగాతో సెల్ఫీ తీసుకుని హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సందేశం లో కేంద్ర మంత్రి తెలిపారు ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ జాతీయ సమైక్యతను,సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా అందరి బాధ్యత అని అన్నారు.ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.