బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్టు

బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్టు

బెల్ట్ షాప్ నిర్వాహకుడు అరెస్ట్. పుట్లూరు మండలంలో బెల్ట్ షాప్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మండల పరిధిలోని కడవకల్లు గ్రామంలో ఎస్ఐ హేమాద్రి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా యల్లనూరు మండలం కూచివారిపల్లి గ్రామానికి చెందిన గోపాల్ నాయుడు ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హేమాద్రి తెలిపారు. ఇప్పటికైనా మండలంలో చట్టానికి విరుద్ధంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.