బదిలీపై వెళుతున్న అసిస్టెంట్ మేనేజర్ ను సన్మానించిన బ్యాంకు సిబ్బంది
బదిలీపై వెళుతున్న అసిస్టెంట్ మేనేజర్ ను సన్మానించిన బ్యాంకు సిబ్బంది
జనచైతన్య న్యూస్-తనకల్లు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని బాలదముద్రం బ్రాంచ్, కొక్కంటి క్రాస్ యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న వంశీ కృష్ణ బదిలీపై కదిరి బ్రాంచ్ వెళుతుండగా ఆయనను తోటి సిబ్బంది ఘనంగా సన్మానించారు. అసిస్టెంట్ మేనేజర్ వంశీ కృష్ణ కు పూలమాలలు వేసి శాలువాలు కప్పి అయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్బంగా అసిస్టెంట్ మేనేజర్ మన్సూర్ మాట్లాడుతూ వంశీ క్రిష్ణ బ్యాంకు యొక్క యాజమాన్యంతో ఎంతో వినయ విధేయతతో మాట్లాడి వినియోగదారులకు బ్యాంకు లావాదేవీలు నిర్వహించబడ్డాయి. నెట్ ఈయన బదిలీపై వెళుతుంటే చాలా బాధాకరంగా. అయన కలసి పని చేసిన రోజులను, అయన బ్యాంకు వినియోగదారులకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్యాషియర్ సాయితేజ రెడ్డి, క్లార్క్ బాబ్జాన్, గోల్డ్ అప్రెజర్ వాసుదేవాచారి, ఆదినారాయణ, బ్యాంకు మిత్రులు, రూప్లా నాయక్, శ్రీనివాసులు, వందేమాతరం టీం సభ్యులు బాగేపల్లి అశోక్, బ్యాంకు సిబ్బంది ఉన్నారు.