జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు

జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు

జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు

 జనచైతన్య న్యూస్- కదిరి

 సత్యసాయి జిల్లా కదిరి పట్టణం లో ఆర్ అండ్ బి వసతి గృహంలో స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, భారతరత్న డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి సందర్భంగా డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కదిరి నియోజవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాదు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేసి, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.