జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన కదిరప్ప

జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన కదిరప్ప

జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన కదిరప్ప

 జనచైతన్య న్యూస్- కదిరి

  సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్ మెంట్ జిల్లా చైర్మన్ కదిరప్ప ఆధ్వర్యంలో కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో పలువురు పార్టీ కార్యకర్తలు కలిసి శనివారం జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.తొలుత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళలు అర్పించారు.అనంతరం కదిరప్ప మాట్లాడుతూ పేరు పొందిన స్వాతంత్ర్య సమర యోధుడు,కుల రహిత సమాజం కోసం పాటు బడిన బడుగు బలహీన వర్గాల నేత సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడన్నారు.అతను బాబూజీగా ప్రసిద్ధుడు, భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడన్నారు.1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యి ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు తిప్పన్న, భాస్కర్, శ్రీనివాసులు, నాగరాజు, గంగాద్రి, తదితరులు పాల్గొన్నారు.