ఎంవీఐ ,ఏ ఎంవీఐ లను కలసిన పలు వాహన యజమానులు
ఎంవీఐ ,ఏ ఎంవీఐ లను కలసిన పలు వాహన యజమానులు
జనచైతన్య న్యూస్- తనకల్లు
సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో కదిరి ఆర్టిఓ కార్యాలయంలో ఎంవీఐ వరప్రసాద్ తో పాటు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏ ఎంవీఐ లు రమణ నాయక్, రాజేశ్ లను తనకల్లు మండలంలోని పలు వాహన యజమానులు భాస్కర్ రెడ్డి, గంగాధర్, మాధవ్ రెడ్డి, నాగిరెడ్డి లతో పాటు పలు వురు డ్రైవర్లు కలసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎంవీఐ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వాహన యజమానులకు డ్రైవర్లకు రోడ్డు ప్రమాదలపై పలు సూచనలను తెలపడమే కాక వాహనాలకు సంబంధించిన రికార్డు లతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములను నిర్ణిత సమయంలో చెల్లించి సంబంధిత రికార్డులను సరిచూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.