పాత పల్లి గ్రామంలో వర్షాలు రాక కాలువలకు నీరు అందక రైతన్నలు తీవ్ర అవస్థలు
పాత పల్లి గ్రామంలో వర్షాలు రాక కాలువలకు నీరు అందక రైతన్నలు తీవ్ర అవస్థలు
జనచైతన్య న్యూస్- యల్లనూరు
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండల పరిధిలోని పాత పల్లి గ్రామంలో రైతన్నలు సాగు చేస్తున్నటువంటి పంటలు సోయాబీన్ , పత్తి, మొక్కజొన్నలు వివిధ రకాలుగా రైతన్నలు సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ వీటికి సంబంధిత వర్షాలు రాక కాలువలకు నీరు అందగా రైతన్నలు తీవ్ర అవస్థలు పడుతున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులు వర్షాలు లేకపోవడంతో పంటలు చాలా వరకు నష్టం వాటిలిందన్నారు. ఇప్పటికైనా మండల అధికారులు రైతులను గుర్తించి ఈ వర్షాలు రాక కాలువలకు నీరు అందించేలా చూడాలని రైతన్నలు తెలియజేయడం జరిగింది.