డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉన్న విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురి అయినారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉన్న విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురి అయినారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉన్న విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురి అయినారు 

 జనచేతన న్యూస్- నాయుడుపేట

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం లో ఎల్ ఏ సాగరం దగ్గర ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆదివారం ఉదయం కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురి అయినారు ఆదివారం రాత్రి 89 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయినారు విద్యార్థులకు వాంతులు విరోచనాలు 39 మంది విద్యార్థులు నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  గురుకులంలో శనివారం వండిన పూరీలు ఆదివారం ఉదయం విద్యార్థులకు పెట్టడంతో అవి తిని అంతేకాకుండా మధ్యాహ్నం వండిన చికెన్ ఆదివారం రాత్రి కూడా పెట్టడం జరిగిందని,  విద్యార్థులు తెలియజేశారు. కొంతమంది విద్యార్థులకు ఆదివారం మధ్యాహ్నం నుండి అస్వస్థతకు గురైనారు గురుకుల ప్రిన్సిపాల్ దాదా బీర్ తో పాటు వార్డెన్ విజయభాస్కర్ తో పాటు అస్వస్థతకు గురైన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, జరిగిన విషయాన్ని బయటకు పోక్కనికుండా ప్రయత్నాలు చేసినారు. కానీ విద్యార్థులు పరిస్థితి దహనీయంగా మారడంతో చేసేది ఏమీ లేక అక్కడ ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కు వైద్యులకు సమాచారం అందించి విద్యార్థులకు రహస్యంగా చికిత్స చేయించడం జరిగింది, అని విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు, మరియు కొంతమంది విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి మరియు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంతేకాకుండా సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి 20 మంది విద్యార్థులను తరలించడం జరిగింది.  సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని అక్కడ ఉన్న డాక్టర్లు తెలియజేశారు.