టిడిపిలోకి వైసీపీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ తో పాటు 40 కుటుంబాలు చేరిక

టిడిపిలోకి వైసీపీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ తో పాటు 40 కుటుంబాలు చేరిక

టీడీపీ లోకి వైసీపీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ తో పాటు 40 కుటుంబాలు చేరిక :

సత్యసాయి జిల్లా ఓ.డి.చెరువు మే (జనచైతన్య న్యూస్)మండల కేంద్రానికి చెందిన వైసీపీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జౌళి బాబా తో పాటు వైసీపీ ని వీడి 40 కుటుంబాలు మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి సమక్షంలో టీడీపీ లోకి చేరారు వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీలో పేదలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు పార్టీని నమ్ముకుని కష్టపడ్డవాళ్ళకి కూడా న్యాయం జరగలేదన్నారు అందుకే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే టీడీపీ రావాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి నియోజకవర్గంలో పల్లె సిందూరమ్మ ఎమ్మెల్యే కావాలన్నారు,ఎంపీ గా పార్థసారథి గెలవాలన్నారు,పార్టీ గెలుపుకోసం మైనారిటీ లు అందరూ కలిసి కష్టపడి పార్టీని గెలిపించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహబూబ్ బాషా, వెంకటరంగారెడ్డి,లక్ష్మీనారాయణ రెడ్డి, షబ్బీర్,చాంద్ బాషా,బాబా ప్రకృద్దీన్, నూర్ మహమ్మద్, అలీబాషా, బాబ్జాన్,మహేశ్వరరెడ్డి,నరసింహులు,శ్రీనివాసులు,వాసు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు