స్టార్ పారడైజ్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు

స్టార్ పారడైజ్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు

స్టార్ పారడైజ్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు

జనచైతన్య న్యూస్-యాడికి 

అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలో 225 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.స్టార్ పారడైజ్ హై స్కూల్ నుండి ర్యాలీని ప్రారంభించి మహాత్మా గాంధీ విగ్రహం వరకు వెళ్లారు.మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు,పాత పోలీస్ స్టేషన్ వైశ్యా వీధి,మెయిన్ బజార్ గుండా ర్యాలీ నిర్వహించారు.స్టార్ పారడైజ్ హై స్కూల్ లో చిన్నారుల వేషధారణ అలరించింది, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి,వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల మేనేజ్ మెంట్ నాగేంద్ర,రంగా,దాదభాష,ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.