భారీగా పసుపు జనసంద్రం...నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి

భారీగా పసుపు జనసంద్రం...నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న  టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి

మార్కాపురం నియోజకవర్గ ఎన్నికల రణక్షేత్రం తారాస్థాయికి చేరింది. గురువారం టిడిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నామినేషన్ ర్యాలీ అట్టహాసంగా సాగింది. వేలాదిగా కార్యకర్తలు తరలి రావడంతో వీధులన్నీ పసుపు మయమయ్యాయి. ర్యాలీ లో కార్యకర్తలను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నన్ను ఓడించడం ఎవడబ్బ తరం కాదు  అంటూ కందుల నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అంతేకాదు ప్యాకేజి స్టార్లు కూడా నా గురించి మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా వైసిపి జిల్లా అధ్యక్షులు ఏపీఐఐసీ చైర్మన్ జంకే వెంకటరెడ్డి ని ఉద్దేశించి  ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు, కులం పేరుతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కులగజ్జిని తనకు అంటించాలని చూస్తున్నాడని దాని పర్యవసానం త్వరలో చూస్తారంటూ పరోక్షంగా హెచ్చరించారు.వచ్చే నెల 13 న జరిగే ఎన్నికల్లో టిడిపి తరఫున బరిలో ఉన్న తనకు ప్రజలు పట్టం కట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.ఒకవైపు డబ్బులు, ప్యాకేజీలు మరోవైపున 22 సంవత్సరాల సేవ,పోరాటం చేస్తున్నాయని అన్నారు.