మానవసేవే మాధవసేవ అందరికి భావం కలగాలి- డా.ఆకుమళ్ళ నాని

మానవసేవే మాధవసేవ అందరికి భావం కలగాలి- డా.ఆకుమళ్ళ నాని

రంజాన్ మాసంలో ముస్లిం

మత పెద్దలకు నూతన వస్త్రాలుబహుకరించిన 

యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డా.ఆకుమళ్ళ.నాని

విజయవాడ-జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

మానవ సేవే మాధవ సేవ అంటున్న డా.ఆకుమళ్ళ.నాని

పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని  విజయవాడ,తూర్పు నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర యం.బి.సి, కార్యాలయంలో సేవారత్న మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డా.ఆకుమళ్ళ.నాని ముస్లింమతపెద్దలకు, నూతన వస్త్రాలు బహుకరించడం జరిగింది. డా.ఆకుమళ్ళ.నాని మాట్లాడుతూ  పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజు పటమట పంట కాల్వ రోడ్డు రాష్ట్ర యం.బి.సి, కార్యాలయంలో ముస్లిం సోదరులకు,మత పెద్దలకు  నూతనవస్త్రాలుఇవ్వడంజరుగిందిప్రతియేటా పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు వస్త్రదానం చేయడం ఎంతో అదృష్టం గా బావిస్తూ ప్రతి ఏటాసహాయంఅందించడం 

గర్వంగా ఉందని నాని అన్నారు తదనంతరం 

ఈ సందర్భంగా రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తాటికొండ రంగబాబు మాట్లాడుతూ సమసమాజ శ్రేయస్సు కోరుతూ స్వంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్న నాని ని ప్రస్తుత రాజకీయ పక్షాలు గానీ,ఏర్పడబోయే ప్రభుత్వాలు గానీ సముచిత స్థానం కల్పిస్తే మరింత సేవా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కార్యాచరణ చేయాలని రాజకీయ పక్షాలకు పిలుపునివ్వడం జరిగింది.తదనంతరం అల్లాహ్ దయతో సఖల మానవాళిసుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,పాడిపంటలతో వ్యాపార,

రాజకీయ రంగాల్లో అబివృద్ధి సాధించాలని  మతపెద్దలు డా. ఆకుమళ్ళ.నాని కి"దువా" చేసి వారి ఆశీస్సులు అందజేశారు.