మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘనంగా 33వ వర్ధంతి నివాళులర్పించారు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘనంగా 33వ వర్ధంతి నివాళులర్పించారు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘనంగా 33వ వర్ధంతి నివాళులర్పించారు 

జనచైతన్య న్యూస్- కదిరి

 సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి 33 వర్ధంతి నివాళులర్పించారు.కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ బి కదిరప్ప మాట్లాడుతూ రాజీవ్ గాంధీ 1944 నాలుగులో జన్మించారు. రాజీవ్ గాంధీ భారతదేశానికి ఆరో ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో విశిష్ట సేవలు అందించారు, అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా ఈయన భారతదేశానికి సేవలు అందించడం జరిగింది, శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు చేసిన మానవ బాంబు దాడిలో రాజీవ్ గాంధీ మరణించడం జరిగింది. రాజీవ్ గాంధీ మరణం ప్రపంచానికే తీరని లోటని ఏకంగా ఇప్పటికీ ఆయన చేసిన సేవలు చరిత్రపుటల్లో నిలిచిపోయాయి,నేడు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా ఆయన అభిమానులు రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దేశానికే వన్నెతెచ్చిన ప్రధాన మంత్రిగా రాజీవ్ గాంధీ నిలిచిపోవడం జరిగిందన్నారు. భారతదేశ కోసం ఇందిరా గాంధీ కుటుంబం త్యాగం చేసిందన్నారు. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు నెహ్రూ కుటుంబాన్ని ఆదర్శ కుటుంబంగా తీసుకొని ముందుకెళ్లాలున్నారు. అదేవిధంగా ఈరోజు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం గా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అన్నారు. ఏది ఏమైనా ప్రధానమంత్రి గా రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి నేడు భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశల వ్యాప్తి చెందడానికి రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు భాస్కర్,శ్రీనివాసులు, తిరుపాలు,అంజనప్ప,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.