ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్
జన చైతన్య న్యూస్ 31 " సిగరెట్ పొగ జీవితానికి సెగ "
ఆరోగ్యవంతమైన అలవాట్లతో పొగాకు రహిత సమాజ నిర్మాణానికి అన్ని వర్గాల వారు కృషి చేయాలని వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ పేర్కొన్నారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఈరోజు ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొంటూ ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి కారకాలలో పొగ త్రాగడం అతి ముఖ్యమైనదని వయోభేదం లేకుండా పొగాకు ఉత్పత్తుల అలవాట్ల వల్ల అందరి ఆయు ప్రమాణ సగటు రేటు అవరోహణ క్రమంలో అతివేగంగా తగ్గిపోతోందని నిలకడకు మరియు మెరుగుదలకు మంచి ఆరోగ్య అలవాట్లు ఒక్కటే ఉత్తమ మార్గమని తెలిపారు పొగాకు వాడకం వలన నోటి ఊపిరితిత్తుల పెద్ద ప్రేగు గర్భాశయ మూత్ర సంబంధ జీర్ణాశయ క్యాన్సర్ మరియు దీర్ఘకాలిక వ్యాధులు పక్షవాతం అంగవైకల్యం గుండె వంధ్యత్వం రక్తనాళాలు గట్టిపడటం వంటి దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు నివారణకై వైద్యులు ఇచ్చే మంచి సలహాలు సూచనలు మరియు ఆరోగ్య అలవాట్లు పాటించాలని సూచించారు తదుపరి సదస్సుకు హాజరైన వారితో పొగాకు ఉత్పత్తుల వినియోగం నుండి పర్యావరణాన్ని రక్షించుటకై ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను ప్రకాష్ డాక్టర్ కమల్ రోహిత్ సిబ్బంది సుభాషిని దిల్షాద్ జయ కుమారి వరలక్ష్మి సరిత హెప్సిబా తదితరులు పాల్గొన్నారు