కృష్ణాజిల్లా మోపిదేవి పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందిన దేవాలయం

కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతు అభివృద్ధి
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ చీప్ సెక్రెటరీ ( రెవెన్యూ & ఎండోమెంట్ ) కరికల్ వలవెన్
ఆలయ అధికారులు, ఆలయ వేద పండితులు నౌడూరీ విశ్వనాథ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ ఆలయ పండితులు అర్చక స్వాములు ఘన స్వాగతం పలికారు. తొలత స్వామి వారి
ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకునగా, ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధి పవన్ కుమార్ శర్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ చీప్ సెక్రెటరీ కరికల్ వలవెన్ ని ఆలయ డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వణాధికారి నల్లం సూర్యచక్రధరరావు ఆలయ మర్యాదలతో సత్కరించి, ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.