టైలర్స్ డే సందర్భంగా దర్జీల సంక్షేమమే - మా లక్ష్యం

టైలర్స్ డే సందర్భంగా దర్జీల సంక్షేమమే - మా లక్ష్యం

దర్జీల సంక్షేమానికి విశేష కృషి

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు 

రాష్ట్రంలోని పేద టైలర్ల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అంతర్జాతీయ దర్జీల దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ టైలర్లందరికీ బుధవారం ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. దుస్తులను అందంగా మలిచి ఆత్మగౌరవాన్ని కాపాడే దర్జీలంటే తనకెంతో గౌరవమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. అటువంటి దర్జీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తొలి జీవో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో టైలర్స్ జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ‘జగనన్న చేదోడు’ పథకం ద్వారా దర్జీలను ఆర్థికంగా ఆదుకున్నారని వ్యాఖ్యానించారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 1,191 మంది టైలర్స్ సోదరసోదరీమణులకు చేదోడు పథకం ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 4 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు. అలాగే దర్జీల సంక్షేమాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు.