జర్నలిస్టులారా! మీ ఆరోగ్యం జాగ్రత్త ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని కాపాడుదాం- తస్మాత్ జాగ్రత్త

జర్నలిస్టులారా!ఆరోగ్యం జాగ్రత్త
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
రాజకీయాల్లో ఎవడి స్వార్థం వాడిదే వారికి ప్రచారం కావాలి - ఓట్లు కావాలి.పాత్రికీయుల జీవితాలపై వారికి పట్టింపు లేదు.కాబట్టి మన కుటుంబ సభ్యుల కోసం మనకోసం మనం జాగ్రతగా ఉండాలి.
ఎన్నికల సందర్భంగా జర్నలిస్ట్ లకు ఆదాయం ఏమి వచ్చిందో తెలియదు కానీ వడ దెబ్బకు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రెస్ మీట్ లు పెట్టే నేతలు ఏసీ కార్లలో తిరుగుతారు. వాళ్ళ మీటింగ్ లకు హాజరయ్యే జర్నలిస్ట్ లు మాత్రం ఎండల్లో తిరుగుతున్నారు. మీరు పెట్టే సభలు, మీడియా సమావేశాల కోసం ద్విచక్ర వాహనాలపై తిరిగే జర్నలిస్టులకు కూడా కార్లు ఏర్పాటు చేయడం ఆయా పార్టీల అభ్యర్థులు బాధ్యతగా భావించండి. భోజనం ఏర్పాటు చెయ్యాలి అంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటల తర్వాతే పెట్టాలి అనే నిబంధన లేదు. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినండి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి.నెత్తిన టోపీ తప్పక ధరించండి.విపరీతమైన ఎండ వేడి నేపథ్యంలో ఉదయం 11 గంటల లోపు ముగిసేలా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తే శేయస్కరం. ఆయా పార్టీల నాయకులు, పోటీ చేసే అభ్యర్థులు ఆ దిశగా ఆలోచన చేయండి. ఇప్పటికే రాష్ట్రాల్లో వడదెబ్బ తగిలిన జర్నలిస్టులు ఎక్కువగానే ఉన్నారు ఎన్నికలు తర్వాత అవి ఆగేవి కావుజరుగుతాయి. వాటికంటే ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త.