హాస్టల్ విద్యార్థులకు నిత్యవసర సరుకులు పంపిణీ

హాస్టల్ విద్యార్థులకు నిత్యవసర సరుకులు పంపిణీ

హాస్టల్ విద్యార్థులకు5వేలు నిత్యవసర సరుకులు _శ్రీరామ వెల్ఫేర్

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

చల్లపల్లి ఇస్లాం నగరులోని మదరసాలో అరబ్బీ ఖురాన్ చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్న పిల్లలకు మరియు నిర్వాహకులకు    ఐదువేల రూపాయలు  విలువచేసే నిత్యవసర సరుకులను అవనిగడ్డకు చెందిన శ్రీరామా వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ తోట శ్యామ్ కిషోర్ నాయుడు తనవంతు సహాయంగా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మదరసాలో చదువుకుంటున్న 30 మంది విద్యార్థులు అరబ్బీ ఖురాన్ చదివి ఉత్తీర్ణులవ్వాలని, తద్వారా మస్జీదులకు ఇమామ్ లుగా, మసీదు గురువులుగా అందరికీ శాంతి బోధించాలని కోరారు. సన్మార్గంలో నడవాలని, అందరికీ మంచి బోధించాలని ఆయన తెలిపారు. ఈ మదరసాకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని శ్యాంకిషోర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి పఠాన్ కరీముల్లా ఖాన్, కృష్ణాజిల్లా ముస్లిం చైతన్య వేదిక ఎగ్జిక్యూటివ్ నెంబర్ అబ్దుల్ సత్తార్, మదర్సా వ్యవస్థాపకులు, నిర్వాహకులు మహమ్మద్ ఆరిఫ్, టైలర్ షరీఫ్,   మహమ్మద్ ఖాదర్, మదరసా సెక్రటరీ మెకానిక్ ఇలియాజ్, లంకపల్లి మసీదు గురువు , ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ మహబూబ్ పాషా, మహమ్మద్ బహదూర్, పెద్ద ఎత్తున ముస్లిం   సోదరులు పాల్గొన్నారు.