వైసీపీకి భారీ షాక్ గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో 150 కుటుంబాలు టిడిపిలో చేరిక
వైసీపీకి భారీ షాక్ గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో 150 కుటుంబాలు టిడిపిలో చేరిక
జన చైతన్య న్యూస్ - గుంతకల్లు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం, గుమ్మనూరు జయరాం గుంతకల్లు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణ 33 వ వార్డుకు చెందిన 150 కుటుంబాలు వైసీపీ నుండి టిడిపిలోకి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో, గుమ్మనూరు నారాయణస్వామి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఇన్ని రోజులు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నందుకు అడుగడుగునా అవమానాలకు గురయ్యాము ఇప్పుడు గుమ్మనూరు జయరాం అన్నలాంటి దమ్మున్న నాయకులు మన గుంతకల్లుు నియోజకవర్గానికి రావడంతో ధైర్యంతో ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో అన్న ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అని భారీ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడు కి కానుకగా ఇస్తామని తెలిపారు. అనంతరం గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, మీ అందరికీ నేను అండగా ఉంటాను అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ ముఖ్య నాయకులు, 33 వ వార్డు నాయకులు, కార్యకర్తలు టీడీపీ,జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు..