పశ్చిమ అసెంబ్లీలో వామపక్షాలను ఎస్సీ వర్గాలకుసీటు కోరారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో, వామపక్ష పార్టీ నుంచి ఎస్సీ వర్గాలకు సీటు ఇవ్వాలని ఏపీ డిజేఎస్ గా కోరుతున్నాము
విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
ఎస్సీ వర్గానికి సంబంధించిన పశ్చిమ నియోజకవర్గంలో 60 వేల వోట్లు పైచిలుకు ఉన్న నేపథ్యంలో, పశ్చిమ నియోజకవర్గంలో ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి, వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి, విద్యావంతులు, నిజాయితీపరులు, పేదల మనిషి, గొప్ప సంస్కర్త, సిపిఐ రాష్ట్ర నాయకులు, ఒకప్పుడు కార్పొరేటర్ గా మరియు ఎమ్మెల్సీగా ప్రజల మన్ననలు పొందిన నాయకులు కామ్రేడ్ జల్లి విల్సన్ గారైతే బాగుంటుందని పశ్చిమ నియోజకవర్గ దళిత వర్గాల ప్రజలందరూ కోరుతున్నారని, త్వరలోనే పశ్చిమ నియోజకవర్గ దళిత సంఘాల నేతలు, సంఘ పెద్దలు, యువకులు, మహిళలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ ని కలిసి ఈ విషయంపై వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది.
మాజీ ఎమ్మెల్సీ కామ్రేడ్ జల్లి విల్సన్ ప్రస్తుతం ఊర్లో లేనందున, రెండు రోజుల తర్వాత ఆయన నివాసంలో కలిసేందుకు దళిత సంఘాల నేతలు సన్నద్ధమవుతారని ఆంధ్ర ప్రదేశ్ దళిత జాగృతి సేన (APDJS) వ్యవస్థాపకులు కాసాని గణేష్ బాబు తెలియజేశారు.