జన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో రాయలసీమ వాటర్ ప్రోగ్రాం

జన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో రాయలసీమ వాటర్ ప్రోగ్రాం

జన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో రాయలసీమ వాటర్ ప్రోగ్రాం

 జనచైతన్య న్యూస్- తనకల్లు  

సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం లో జన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో రాయలసీమ వాటర్ ప్రోగ్రాం అమలు చేస్తున్న గ్రామాలను అజీమ్ ప్రేమ్ జీ సమస్త ప్రతినిధి అన్వర్ , వాసన్ సంస్థ ప్రతినిధి శ్రీ చంద్రశేఖర్, విజిట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్పురి వారి పల్లెలో జరుగుతున్న ఈ పి ఆర్ ఏ కార్యక్రమాన్ని పరిశీలించి సి ఆర్ పి లకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. రాగినపల్లిలో లక్ష్మీపతి రెడ్డి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుచేసిన చెండుమల్లి పూలతోటను సందర్శించి రైతు అనుభవాలను అడిగి తెలుసుకోవడం జరిగింది, అలాగే గ్రామాలలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసేలా రాబోవు నాలుగు సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలియజేసినారు. తరువాత తనకల్లు జన జాగృతి సమస్త కార్యాలయంలో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి సిఆర్పి లకు ఈ కార్యక్రమంలో చేపట్టే కార్యక్రమాలు గురించి అవగాహన కల్పించడం జరిగింది, అలాగే రైతులు పెట్టే పంటలు నీరు లేకుండా ఎండిపోకుండా వాటర్ షేరింగ్ విధానంలో రక్షక తడులు ఇచ్చి పంటలు కాపాడుకునే ఏర్పాట్లు చేయాలని సూచించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న బీడు భూములన్నీ రైతులు సాగు చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సాహకలను ఇచ్చి బీడు భూములు సాగు చేయించాలని, సి ఆర్ పి లకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం రాబోవు నాలుగు సంవత్సరాలు అమలవుతుందని తెలియజేసినారు, ఈ కార్యక్రమంలో జన జాగృతి సంస్థ సీఈవో బలరాం, సిబ్బంది పాల్గొనడం జరిగింది.