తిరుపతిలో స్పాట్ అడ్మిషన్స్
(జన చైతన్య న్యూస్- తిరుపతి) తిరుపతిలో స్పాట్ అడ్మిషన్స్
తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యమునందలి జూనియర్ శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయా కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కొరకు 01 జులై 2024 మరియు 02 జులై 2024 తేదీలలో స్పాట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ జరుగును.ఈ కౌన్సిలింగ్ లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఇదివరకే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి మెరిట్ ప్రాతిపదికన స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ప్రాధాన్యతా క్రమము మొదట టీటీడీ ఉద్యోగుల పిల్లలకు, ఎస్వీ బాలమందిరం పిల్లలకు, ఇదివరకు మూడు విడతల్లో సీటు వచ్చి వివిధ కారణాలతో అడ్మిషన్ పొందలేని వారికి,తిరుపతి స్థానిక విద్యార్థులకు, స్థానికేతర విద్యార్థులకు ఈ ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయిస్తారు.పదవ తరగతి లో సాధించిన మార్కుల ప్రాధాన్యతా క్రమం 01 జులై 2024 సోమవారం ఉదయం గం 8.00 నుండి మధ్యాహ్నము 1.00 గం ల వరకు 550 (91.5%)మార్కులు పైగా సాధించిన వారికి, మధ్యాహ్నం గం 2.00 నుండి సాయంత్రం 6.00 గం వరకు, 549 నుండి 500 మార్కులు వచ్చిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. 02 జులై 2024 మంగళవారం ఉదయం గం 8.00 నుండి మధ్యాహ్నము 1.00 గం ల వరకు 499 మార్కుల నుండి 450 మార్కులు సాధించిన వారికి, మధ్యాహ్నం గం 2.00 నుండి సాయంత్రం 6.00 గం వరకు 449 నుండి 360 మార్కులు వచ్చిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ కు హాజరయ్యే వారు అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ముందుగా తెలుసుకోవాలని కోరడమైనది. స్పాట్ అడ్మిషన్ లో ప్రవేశాలకు హాస్టల్ వసతి ఉండదు.పదో తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. వారికి తెలుగు మీడియం గ్రూపులు కేటాయించడం జరుగదు.టిటిడి విద్యాశాఖ తిరుపతి.