అంగన్వాడీలపైన రాజకీయ పెత్తనం అత్యంత దయనీయం ఆత్మహత్యాయత్నానికి ప్రేరణ చేసిన రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయాలి
అంగన్వాడీలపైన రాజకీయ పెత్తనం అత్యంత దయనీయం ఆత్మహత్యాయత్నానికి ప్రేరణ చేసిన రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయాలి
జనచైతన్య న్యూస్-తనకల్లు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలో అంగన్వాడి కార్యకర్తల పైన రాజకీయ దాడులు చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ సిఐటియూ మండల కన్వీనర్ ఒంటెద్దు వేమన్న ఆధ్వర్యంలో బుధవారం మండల అంగన్వాడీ కార్యకర్తలుతో కలిసి తహసీల్దార్ శోభాసువర్ణమ్మకు వినతి పత్రం అందచేశారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ గతవారం కిందట ఒడిసి మండలంలోని వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమని పైన స్థానిక ఒక రాజకీయ నాయకుడి వేధింపులు తలలేక ఆత్మహత్యయత్నం చేసుకొని ప్రణాపాయస్థితికి వెళ్లిందని,ఈ ఘటన చేసుకోవడానికి ప్రేరేపించిన రాజకీయ నాయకుడుపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రస్తుత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవలసిందిగా ఈ సందర్బంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ లీడర్ భాగ్యమ్మ, శివమ్మ బాగ్య, రామాదేవి, పలువురు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.