భూమి లేని వారికి 3 ఎకరాలు ఇవ్వాలని డిమాండ్
Breaking news
భూమి లేని నిరుపేదలకు మూడు ఎకరాలు ఇవ్వాలి
శ్రీ సత్య సాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ బి కదిరిప్ప
స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్న ఎంతో మంది భూమి లేని నిరుపేదలగానే జీవిస్తున్నారు భూమిలేని నిరుపేదలకు అభ్యంతరం లేని ప్రభుత్వ(అసైన్మెంట్) భూమిని సాగుచేసుకోవడానికి 3 ఎకరాలు ఇవ్వాలని బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆయన తెలియజేసారు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం లో వెనుకబడిన ఎస్సీ వర్గాలకు ప్రతి కుటుంబానికి అసైన్మెంట్ సాగుభూములు ఇవ్వడం జరిగిందన్నారు పేదల కోసం నిత్యం పోరాడుతామని కష్ట సమయాలలో పేదల కోసం తోడుండి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని ఆయన తెలియజేసారు జిల్లా వ్యాప్తంగా అసైన్మెంట్ భూములు చాలానే ఉన్నాయని ఆ భూములు నిరుపేదలకు 3 ఎకరాలు ఇవ్వాలని వీటి పరిష్కరానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెల్తామని ఆయన తెలియ జేశారు