మండల కన్వీనర్ కొండయ్య స్వగృహమునందు తారక రామారావు 101 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.
మండల కన్వీనర్ కొండయ్య స్వగృహమునందు తారక రామారావు 101 వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.
జన చైతన్య న్యూస్- గాండ్లపెంట
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం కదిరి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సూచన మేరకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 101వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పిస్తూ గాండ్లపెంట మండల కన్వీనర్ కొండయ్య, అధ్యక్షతన వారి స్వగృహమునందు టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ రెడ్డి, కృష్ణ, గంగాద్రి, శ్రీరాములు, వెంటకణరాయణ, ఆంజనేయులు, రమణ, రామయ్య, చిన్న రమణ, అల్లా ప్రకాష్ , నరసింహులు, శేఖర్ నాయక్, మనోహర్, మోహన్ కృష్ణ, జయప్రకాష్, పురుషోత్తం, హరి ప్రసాద్ తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం.