భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా :అంబేద్కర్

భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా :అంబేద్కర్

రాజ్యాంగ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ప్రత్తిపాటి పిలుపు.            (జనచైతన్య కేబుల్ న్యూస్ )          - సమతా సైనిక్ దళ్ జాతీయ సదస్సులో నాయకుల ప్రతిజ్ఞ.    విజయవాడ- ఫోరం ఫర్ ఆర్.టి.ఐ (వైస్ ప్రెసిడెంట్ ) కృష్ణాజిల్లా-తమ్మిన గంగాధర్    - నవంబర్ 26: రాజ్యాంగాన్ని దుష్ట శక్తుల నుండి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ పిలుపు ఇచ్చారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా విజయవాడ లోనీ ప్రెస్ క్లబ్ లో సమతా సైనిక్ దళ్ ఆద్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు యేసుపోగు నాగేశ్వరరావు అధ్యక్షతన జాతీయ సదస్సు  జరిగింది. చంద్రమోహన్ సదస్సుకు  ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగంలో పాటు, సమాచార హక్కు చట్టం ను కాపాడుకోవాలని, ఇందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. సామాజిక వేత్త అరుణారాయ్ కృషిని , పేదలు ఆర్టీఐ ఏవిధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాలను సదస్సులో వివరించారు. సదస్సులో పలు సంస్థ ల ప్రతినిధులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన కు చేసిన కృషిని వివరించారు.సంస్థ ఏర్పడి వంద సంవత్సరాలుగా అవుతున్న సందర్భంగా జాతీయ నాయకులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం అతిథులను సన్మానించారు. విజయవాడ సిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి స్వామి దాసు,తమ్మినగంగాధర్ , ఆద్వర్యంలో పెద్దఎత్తున టీమ్ పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావటం విశేషం. అదేవిధంగా కాకినాడ లో ఎఫ్ ఆర్టీఐ జిల్లా కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్ర పటానికి జిల్లా అధ్యక్షులు శివ నివాళ్లు అర్పించారు. జిల్లా లోని టీమ్ పాల్గొన్నారు. తిరుపతి జోనల్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వర్కింగ్ కమిటి ప్రెసిడెంట్ రేవతి, రాష్ట్ర మహిళా అధ్యక్షులు చంద్ర కళ, జిల్లా అదికర ప్రతినిధి చంద్ర శేఖర్ లు అంబేద్కర్  భారత దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కడపలో జిల్లా ఉపాధ్యక్షులు పివి ఐ రాజు ఆద్వర్యంలో టీమ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి సమావేశ అయ్యారు. జిల్లా టీమ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని లో అంబేద్కర్ చిత్ర పటానికి జిల్లా ప్రధాన కార్యదర్శి తిక్కన ,జిల్లా టీమ్ ఆద్వర్యంలో నివాల్లు అర్పించారు. అతిథులకు సన్మానాలు నిర్వహించారు.ఆర్టీఐ గురించితిక్కన్ వివరించారు.