ముత్యాలంపాడు ముగ్గుల పోటీలో బహుమతి ప్రధానోత్సవం
స్థానిక 31వ డివిజన్ ముత్యాలంపాడు ముగ్గుల పోటీ బహుమతి ప్రధానోత్సవం
విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
ముత్యాలంపాడు సాయిబాబా గుడి దగ్గర ఉన్న గోకరాజు కళ్యాణమండపం వద్ద సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ అనంతరం బహుమతి ప్రధానోత్సవ సభ ఏర్పాటు చేయడమైనది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు సతీమణి బోండా సుజాత పాల్గొని ముగ్గులను పరిశీలించి విజేతలుగా గెలుపొందిన మొదటి బహుమతి ద్వితీయ బహుమతిని వారి చేతుల మీదుగా అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు దెందుకూరి మురళీకృష్ణంరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ పిన్నమ్మరాజు త్రిమూర్తి రాజు,సంధి రెడ్డి గాయత్రి,రాజేంద్ర, రామలింగ రాజు, పడమటి రామకృష్ణ,ప్రసాద్,బాబి, బెజ్జం సురేష్, చంటి, రాజేష్ వర్మ ,గుర్రంసుబ్బారావు,శేషమ్మ,చిన్ని,శారద,లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.