సెంట్రల్ లో టిడిపి కార్యాలయం ముందు భోగి మంటలు ఏర్పాటు

సెంట్రల్ లో టిడిపి కార్యాలయం ముందు భోగి మంటలు ఏర్పాటు

సెంట్రల్ తెలుగుదేశం కార్యాలయం ముందు భోగి మంటలు ఏర్పాటు

విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

సింగ్ నగర్, సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయము

సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేయడం జరిగినది.

ఈ కార్యక్రమానికి టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు  సెంట్రల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవలే అంగన్వాడీలు చేస్తున్న దీక్షను నిరంకసత్వంగా అణిచివేయడానికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో NO:2 ప్రతులను మరియు వైయస్సార్సీపి ప్రభుత్వం లో ఐదు సంవత్సరాలుగా నత్తనడకగా సాగుతున్న పనుల ఫోటోలను దగ్ధం చేయటం జరిగింది.

ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో2014 నుంచి 2019 హయాంలో అభివృద్ధి జరిగిందని 2019 తర్వాత వైయస్సార్సీపి ప్రభుత్వం లో అభివృద్ధి కనపడలేదు అని ,మధురానగర్ RUB కి అనుమతులు మంజూరు చేసి నిధులు కూడా కేటాయించిన ఇంతవరకు ఐదు సంవత్సరాలలో ఈ అసమర్థత వైఆర్సిపి ప్రభుత్వం పూర్తి చేయలేక పోయినదని, తాము అధికారంలో ఉండగా దేవీ నగర్, సింగ్ నగర్ RUB ని కేవలం 7 నెలలలో పూర్తి చేశామని గుర్తు చేశారు. తిట్కో ఇల్లు పూర్తయి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, తేలుగుదేశం ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అని తిట్కో ఇళ్లనులబ్ధిదారులకు అందచేయని అసమర్థత ప్రభుత్వం వై ఆర్ సి పి అని దుయ్యబట్టారు. అంగన్వాడీ చేస్తున్న పోరాటాన్ని అణచివేస్తానికి ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 2 ప్రకటించిందని, వారికి తాము అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. అంగన్వాడీలు, మున్సిపాలిటీ ఉద్యోగులు, చిరుద్యోగులు అందరూ కూడా ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారని, ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉద్యోగుల మరియు ప్రజల ఆగ్రహ జ్వాలలలో కాలిపోవడం ఖాయమని తెలిపారు. వచ్చే సంవత్సరం నాటికి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో ఉంటుందని సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండిటినీ కూడా తీసుకువెళ్లి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి పటంలో ప్రథమ స్థానంలో ఉంచుతామని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నవనీతం సాంబశివరావు, లక్కా సాయిరాం గౌడ్, ఘంటా కృష్ణమోహన్, పిరియ సోమేశ్వరరావు, దాసరి ఉదాయశ్రీ, పైడి తులసి,జగదంబ, బెజ్జం జైపాల్, మల్లిఖార్జున ,పర్వీన్, తిరుపతి గౌడ్, గౌసియా, విజయ, సుల్తానా, కంచి ధన శేఖర్, గడ్డం రాజు, మల్లేశ్వరరావు, లబ్బా వైకుంఠం, అమర్నాథ్ గౌడ్, గరిమెళ్ళ రాధిక, వేణు, ఇమ్మడి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.