తురకపల్లి గ్రామంలో రైతు సంఘం మండల కమిటీ ఏర్పాటు

తురకపల్లి గ్రామంలో రైతు సంఘం మండల కమిటీ ఏర్పాటు

తురకపల్లి గ్రామంలో రైతు సంఘం మండల కమిటీ ఏర్పాటు

 జనచైతన్య న్యూస్-పెద్దపప్పూరు 

 అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం తురకపల్లి గ్రామంలో రైతు సంఘం మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, మొత్తం 8 మందితో కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. మండల కార్యదర్శిగా పి దేవేందర్ రెడ్డి, అధ్యక్షులుగా నరేష్ యాదవ్, సూర్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొండయ్య, చంద్రశేఖర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నాగేంద్ర యాదవ్ వీరందరినీ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే దాదాపు పది గ్రామాల నుండి రైతుల హాజరు కావడం జరిగింది, వీటితోపాటు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజారాం రెడ్డి హాజరు కావడం జరిగింది,  ప్రస్తుత నూతన కమిటీ ఎన్నుకొని రైతన్న సమస్యలు చర్చించడం జరిగింది. వ్యవసాయ పంప్ సెట్లకు విద్యుత్ మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేయాలని, గత సంవత్సరంలో ప్రకటించిన ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే ప్రకటించాలని రైతు పండించే ప్రతి పంట ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతు సేవ కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు రైతులకు సబ్సిడీతో అందించాలని, పండ్లతోటల రైతులకు ఉద్యాన శాఖ ద్వారా యంత్రాలు డ్రిప్పు, స్పింకర్లు, పండ్లమొక్కలు సబ్సిడీతో అందించాలని ఈ విధంగా తీర్మానం చేయడం జరిగింది. నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమాలు నిర్వహించి 26న జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నా జయప్రదం చేయాలని మండల మహాసభ తీర్మానం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పెద్దపప్పూరు, పెద్ద యక్కలూరు, తురకపల్లి, సింగనగుట్టపల్లి, చెర్లోపల్లి, బొందలదిన్నె గ్రామాల నుండి పెద్ద సూర్యుడు, నారాయణరెడ్డి, శ్రీరాములు, పాపిరెడ్డి, వసంత కుమార్, కొండయ్య, నారాయణస్వామి, వసంత్, సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.