ఎన్నికల సమయంలో లిక్కర్ మందులను ఆపివేయాలి

ఎన్నికల సమయంలో లిక్కర్ మందులను ఆపివేయాలి

‍‍ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఉచిత మద్యం పంపిణీని ఆపి యువతను కాపాడండి

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు  ఉచితంగా ఓటర్లకు కార్యకర్తలకు,యువతకు మద్యం పంపిణీకి స్వస్తి పలికి యువతను కాపాడాలని 

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డీ లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్ లో స్వేచ్ఛాయుత ఎన్నికలు,మద్యం ప్రభావం, నియంత్రణ మన ముందున్న సవాళ్లు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో 

పలు మహిళా సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు.

ఈ సంధర్భంగా వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ ప్రతీ ఎన్నికలలో ఉచితంగా మద్యం పంపిణీ వలన యువతకు మద్యం అలవాటవుతుందనీ తెలిపారు. అభ్యర్థులు ఖర్చు పెట్టే వ్యయంలో 25% మధ్యం పంపిణీకే కేటాయిస్తున్నారని  అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత 5సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుష్ఫలితాలను వివరించే ఒక్క ప్రకటన గాని, అడ్వటైజ్మెంట్ కానీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎలాంటి సమీక్షలు మద్యం పై నిర్వహించలేదన్నారు . 

త్రాగుడు తప్పు అనే భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 

చిన్న వయసులోనే మద్యానికి అలవాటైతే వారు వ్యసనంపరులుగా మారతారని తెలిపారు.ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో వేలాది ఎకరాలలో గంజాయి పండిస్తుంటే ఎలాంటి చర్యలు చేపట్టలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు.రాజకీయ పార్టీలు వారి వారి ఎన్నికల మేనిఫెస్టోలో మధ్య నియంత్రణ ప్రాధాన్యత అంశంగా చేర్చాలని కోరారు.

కృష్ణాజిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ 60 రూపాయలకు లభించే చీపులిక్కరు  నేడు 250 రూపాయలకు అమ్ముతున్నారని 

కల్తీ మద్యం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుష్ఫలితాలపై యువత సోషల్ మీడియాలో  విస్తృత ప్రచారం చేయాలన్నారు.

మద్యం మత్తులో కార్మికుల ఉత్పాదక శక్తిని కోల్పోతున్నారని, యువత  నిర్వీర్యం అవుతుందని అన్నారు.ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ మద్య నిషేధం కన్న నియంత్రణ ఆచరణ సాధ్యమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం మద్యంపై జాతీయ విధానాన్ని ప్రకటించాలని కోరారు. 

మహిళలోకం రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చి మద్య నియంత్రణ అమలుకు కృషి చేయాలి అన్నారు.

జాతీయ మహిళా సమాఖ్య నేత అక్కినేని వనజ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రమాదకరమైన జే బ్రాండ్స్ కొనసాగుతున్నాయని, సైనైడ్ లాంటి రసాయనాలతో కలుషితమైన మద్యం తీసుకోవడం వలన తీవ్రమైన అనారోగ్యాలపాలవుతున్నారని అన్నారు.ఢిల్లీకి మించిన లిక్కర్ స్కాం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుందని వివరించారు. పి ఓ డబ్ల్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి పి పద్మ ప్రసంగిస్తూ మధ్యానికి కుటుంబ పెద్ద బానిసైతే ఆ కుటుంబంలో మహిళల ఆవేదన వర్ణనాతీతమని, పిల్లలు వీధిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. నేరాలు, హత్యలు, అత్యాచారాలు యాక్సిడెంట్లు, ఘర్షణలు మొదలైన వాటికి కేంద్ర బిందువుగా మత్తు పానీయాలు ఉన్నాయని వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు సమాజ సేవకులు 

గోళ్ళ నారాయణరావు, అక్కినేని భవాని ప్రసాద్, తదితరులు ప్రసంగించారు 

కార్యక్రమం ప్రారంభానికి ముందు రంగం ప్రజా సాంస్కృతిక వేదిక 

ఆర్.రాజేష్ బృందం  మద్యం పరిణామాలపై చైతన్య గీతాలను ఆలపించారు.

వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి

సంయుక్త కార్యదర్శి సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ.