విశాఖపట్నం లోక్ సభ బరిలో -మాలతి
విశాఖపట్నం లోక్ సభ బరిలో మాలతి
విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )
దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపుపొందిన విశాఖపట్నంపై కొన్ని దుష్టశక్తుల కన్నుపడటం విశాఖపట్నంకే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం ప్రమాదంలో పడుతుందనే ఆందోళనతో విశాఖపట్నాన్ని కాపాడుకొని తద్వారా ఉత్తరాంధ్రను రక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ సంవత్సరం జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది . ఈరోజు రాజకీయాలను దుష్టులు శాసించడం ప్రజల మనుగడకే ప్రమాదం కావున ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగాకోరారు .ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి రాజకీయాలనురక్షించుకోకపోతే మనపిల్లలకు ఎంత ఉన్నత చదువులు చదివించి ఎన్ని ఆస్తులు సంపాదించి పెట్టిన వాళ్ల మనుగడ ప్రమాదంలో పడుతుంది కావున మన భవిష్యత్ తరాల మనుగడ కోసమైనా ప్రజలు చైతన్యవంతులై విలువలు కలిగిన సమర్థ నాయకులను ఎన్నుకోవలసిన అవసరం ఉందని తెలియజేశారు .
మరిశర్ల మాలతి సామాజిక కార్యకర్త