మీడియాపై పోలీస్ దాడి-పెన్ను పై గన్ను దౌర్జన్యం
ప్రెస్ పై పోలీస్ దాడి - పెన్ను ని కొట్టిన గన్ను
విజయవాడ- జనచైతన్య
(రుషిత్ కుమార్)
మీడియాపై దాడులకు తెగబడుతున్న పోలీసులు మీడియా స్వేచ్ఛను హరిస్తున్న అంగళ్ళు లోని పోలీసులు. నారా చంద్రబాబు నాయుడు సభను నిర్వీర్యం చేయడానికి ప్రవర్తిస్తున్న పోలీసులు. అంగళ్లు కూడలి వద్ద జరుగుతున్న చంద్రబాబు సభను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాపై చేయి చేసుకున్న కానిస్టేబుల్ హరిబాబు నాయక్
మీడియా వారిపై దురుసుగా ప్రవర్తించి వారి యొక్క స్వేచ్ఛను హరిస్తున్న కానిస్టేబుల్ హరిబాబు నాయక్. పోలీసు వారు తమ విధులను కర్తవ్యం గా నిర్వహించకుండా అధికార పార్టీకి చెందిన వ్యక్తులుగా వ్యవహరిస్తుండడంపై మండిపడుతున్న మీడియా ప్రతినిధులు. చంద్రబాబు సభను రెండవ అంతస్తు నుంచి కవరు చేయడానికి వెళ్ళిన మీడియా వారిపై ఐడి కార్డులు చూపించినా కూడా నెట్టుకుంటూ వచ్చి చేయి చేసుకున్న కానిస్టేబుల్ హరిబాబు నాయక్.
మీడియా వారిపై చేయి చేసుకున్న కానిస్టేబుల్ హరిబాబు నాయక్ పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపిన మీడియా ప్రతినిధులు.
హరిబాబు లాంటి కానిస్టేబుల్ లాంటి వారి వల్లనే రాష్ట్రవ్యాప్తంగా పోలీసు వ్యవస్థకు మచ్చ తెస్తున్న చీడపురుగులు. పోలీస్ కానిస్టేబుల్ దాడిలో మీడియా వారి మొబైల్స్ లాక్కొని నేలకు కొట్టడంతో ధ్వంసం అవడం అమానుషం. ఇలాంటి పోలీసుల పై తక్షణం చర్యలు తీసుకొని పోలీసు వ్యవస్థను కాపాడాల్సిందిగా మీడియా ప్రతినిధుల డిమాండ్.