వివేకానంద హై స్కూల్ లో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జన్మదిన వేడుకలు
వివేకానంద హై స్కూల్ లో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జన్మదిన వేడుకలు
జనచైతన్య న్యూస్- యాడికి
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలోని కోన రోడ్డు నందు గల వివేకానంద హై స్కూల్ లో పింగళి వెంకయ్య 148వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చేసిన దేశ సేవ లను విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగినది. పింగళి వెంకయ్య జన్మదిన వేడుకలను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినది. అంతేకాకుండా విద్యార్థినీ విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, కరెస్పాండెంట్ రంగారెడ్డి పాల్గొనడం జరిగింది.