వైద్యశాఖలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
వైద్య శాఖలో ఇద్దరి ఉద్యోగుల పై సస్పెన్షన్ వేటు
విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)
శ్రీకాకుళం జిల్లాలో వైద్య శాఖలో ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు మరియు ఫిర్యాదులు మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూపరిండెంట్ భాస్కర్ కుమార్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస ఆచారిని సస్పెండ్ చేయాలని వైద్య శాఖ రీజనల్ డైరెక్టర్ కు రికమెండ్ చేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మీనాక్షి తెలిపారు. రీజనల్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు పంపించిన వెంటనే వారిని సస్పెండ్ చేస్తామని ఆమె తెలిపారు. అలాగే జిల్లా వైద్య శాఖలో ఎవరు ఎటువంటి అక్రమాలకు పాల్పడిన ఎవరిని విడిచి పెట్టేది లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మీనాక్షి తెలిపారు.