జాతీయ యువ అవార్డు అందుకున్న పుట్లూరు యువకుడు వి.రవి
(జన చైతన్య న్యూస్ ) యూత్ పార్లమెంట్ సరస్సులో పాల్గొన్న పుట్లూరు మండలానికి చెందిన యువకుడు వీ.రవి బుధవారం పాల్గొనడం జరిగింది.అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ నెహ్రూ యువ కేంద్రంలో భాగంగా అనంతపురం ఏపీ ఆధ్వర్యంలో నేడు జేఎన్టీయూఏ కాలేజ్ నందు నిర్వహించినటు వంటి డిస్టిక్ లెవెల్ నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ సెషన్ లో పుట్లూరు మండలానికి చెందిన యువకుడు వి.రవి పాల్గొని మాట్లాడుతు యువకులందరు కూడా చదువులకే పరిమితం కాకుండా సామాజిక సేవలు అందించాలని సూచించారు. అంతే కాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి యువత చట్టా సభల్లో అడుగు పెట్టాలని కోరారు. ప్రజా సమస్యలపై చట్టసభల్లో చర్చించి పరిష్కార మార్గాలు చూపాలని తెలియజేశారు. అనంతరం జాతీయ యువ అవార్డు అందుకున్న (బీసాటి భరత్) చేత ప్రశంస పత్రం అందుకోవడం పై పుట్లూరు యూత్ హర్షం వ్యక్తం చేశారు.