అన్నదాతలకు పెట్టుబడి రాయితీ 20వేల రూపాయలను ఈ ఖరీఫ్ లోనే రైతులకు అందించాలి

అన్నదాతలకు పెట్టుబడి రాయితీ 20వేల రూపాయలను ఈ ఖరీఫ్ లోనే రైతులకు అందించాలి

అన్నదాతలకు పెట్టుబడి రాయితీ 20వేల రూపాయలను ఈ ఖరీఫ్ లోనే రైతులకు అందించాలి

 జనచైతన్య న్యూస్- పెద్దవడుగూరు 

 అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలో సిపిఐ రైతుసంఘము ఆధ్వర్యంలో పెద్దవడుగూరు మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయములో మండలకమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సందర్భంగా సీపీఐ మండలకార్యదర్శి వెంకటరాముడు యాదవ్ మాట్లాడుతూ, ఖరీఫ్ లో మండలవ్యాప్తంగా పంటలు కోంతమంది సాగుచేశారు. మరి కోంతమంది వర్షము కోసము ఏదురు చూస్తున్నారు, అందుకోసం ప్రత్యామ్నాయంగా పంటలు వేయాలని చూస్తున్నారు,  అందుకోసం సీపీఐ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది ఏమనగా మండలవ్యాప్తంగా రైతులు చిరుధాన్యాలైన పెసర, అలసంద, ఉలవ ,సజ్జ ,జొన్న, కోర్ర అనేకమైన పంటలను సాగు చేయాలంటే ప్రభుత్వం తక్షణమే రైతులకు సరిపడు విత్తనాలను ఉచితంగా అందించాలి. ఎరువులు పురుగుమందులు 90 శాతం సబ్సిడీతో రైతులు అందించాలి, లేకుంటే ఈ ఖరీఫ్లో పంటలు సాగు చేయడం చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్క సంవత్సరం పంటలు సాగు చేసి నష్టపోవడం జరుగుతున్నది. అందుకోసం తక్షణమే ఈ ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ కింద 20000 రూపాయలు పెట్టుబడి రాయితీని రైతులకు ఈ ఖరీఫ్ లోని తక్షణమే రైతులకు అందించాలని, మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి చాలా చోట్ల పండ్ల తోటలు ఎండు ముఖం పట్టాయి. అందుకోసం రైతుల అప్పులు చేసి బోర్లు వేసినా నీరు పడడం లేదు,  అందుకోసం ప్రభుత్వమే నీటి జాడల కోసం జియా లిస్టు అధికారులను పంపించి రైతుల పొలాల్లో ఉచితంగా బోరు సౌకర్యం కల్పించాలని, మరియు తెలంగాణ తరహాలో 2 లక్షల రుణమాఫీని ఈ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని, ఉపాదీహమీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానము చేయాలని, సాగునీటి ప్రాజెక్టులు కింద కాలువలను క్లీనింగ్ చేసి చివరి అయికట్టు వరకు నీటిని వదలాలని, రైతులని అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఈ నెల,29,30,31తేదీలలో రాష్ట్ర రైతు సంఘం సమ్మేళనం మదనపల్లి ఎన్ వి ఆర్ కళ్యాణమండపంలో జరుగుతున్నది. కావున రైతులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం,  ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఆదినారాయణ సిపిఐ మండల సహాయ కార్యదర్శి పోలా రంగస్వామి, సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ, ఏఐటియుసి మండల అధ్యక్షులు హుస్సేన్ పీరా, వడుగూరు కార్యదర్శి రంగనాయకులు, నాయకులు సుధాకర్ గౌడ్, శ్రీనివాసులు రెడ్డి, ఆది వీరుపాపురం, మల్లికార్జున , తదితరులు పాల్గొనడమైనది.