రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఎన్నికైన నాగిరెడ్డి
రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఎన్నికైన నాగిరెడ్డి
జనచైతన్య న్యూస్- తనకల్లు
అనంతపురం జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ గౌరవాద్యక్షులు సుమన్ టివి ఐ డ్రీమ్ ఛానెల్ నాగరాజు ,అధ్యక్షులు కంచం ప్రభాకర్ రెడ్డి లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా పలు పత్రికలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కు సంబంధించిన పాత్రికేయుల ను ఉద్దేశించి వీరు మాట్లాడుతూ పాత్రికేయుల సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్క రూ నడుం బిగించాలని ఏ పాత్రికేయ సంఘం అయినా వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్రిడేషన్ తో పని లేకుండా పనిచేసే వారంతా జర్నలిస్ట్ లే నన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్ట్ లకు అన్ని విధాలా అన్యాయం చేసిందన్నారు. ఈ ప్రభుత్వం లో అన్ని రకాల హక్కులతో పాటు జర్నలిస్ట్ లపై దాడు లను అరికట్టాలని జర్నలిస్ట్ ల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసేలా రాబోవు రోజుల్లో డిమాండ్ చేసేవిధంగా అడుగులు వేయాలన్నారు. అనంతరం రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట వైస్ ప్రెసిడెంట్ గా ఏపీ న్యూస్ స్టేట్ కోఆర్డినేటర్ మోహన్ తో పాటు రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రీజనల్ ప్రెసిడెంట్ గా రమేష్, రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా తనకల్లుకు చెందిన నాగిరెడ్డి లతో పాటు తదితరుల ను జిల్లా అధ్యక్ష, సెక్రెటరీలుగా ఎన్నుకున్నారు.