ఇంటింటికి భవిష్యత్తు గ్యారెంటీ పాదయాత్ర
స్థానిక 36వ డివిజన్ భవిష్యత్తు గ్యారెంటీ పాదయాత్ర
విజయవాడ - జనచైతన్య ( తమ్మిన గంగాధర్ )
హనుమాన్ పేట 36వ డివిజన్ హనుమాన్ పేట ఆలపాటి కల్యాణ మండపం వద్ద నుండి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ పాదయాత్రగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా వివరించే కార్యక్రమం నిర్వహించబడును .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరావు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్దే తప్ప ఈ వైసిపి పాలన లో ఒక్కశాతం కూడా పనులు ముందుకు సాగ లేదు అని,చంద్రబాబునాయుడు అనుభవమున్న వ్యక్తి,పవన్ కళ్యాణ్ గారు నిబద్దత కలిగిన వ్యక్తి వీరిరువురి కలయిక రానున్న రోజులలో ప్రజలకు మేలు చేయబోతుంది ,జనసేన తెలుగుదేశం కలయికతో వైసీపీ పార్టీ నేతలకు గుండెల్లో దడ మొదలయ్యింది అని
ఈరోజు మహిళల సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ఇంటి-ఇంటికి వెళ్తుంటే మహిళలు తమ బాధలు చెప్పుకుంటున్నారు అని,అనేక సమస్యలు. నిత్యావసర ధరలు పప్పు, ఉప్పు, సరుకులు అన్ని ఆకాశాన్ని అంటుతున్నాయి అని, తెలుగుదేశం ప్రభుత్వంలో రూ500 రూపాయలు వచ్చే కరెంటు చార్జీలు ఈరోజున రూ2000 వరకు వస్తుందని కూలి పనులు చేసుకునే వారు ఎలా కడతారని ప్రశ్నించారు.
దీనికి తోడు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఏవి కనీవినీ ఎరుగని రీతిలో కరెంటు చార్జీలు, ఇంటి పన్ను ,నీటి పన్ను, అలాగే ఎప్పుడు కలలో కూడా ఊహించలేనటువంటి చెత్త మీద పన్నేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపి పసి పిల్లలు తాగే పాల మీద లీటరుకు రూ10 రూపాయలు పైనే పెంచారనితెలుగుదేశం పార్టీ కి మాత్రమే సంపద పెంచడం అభివృద్ధి చేయడం తెలుసు సంక్షేమం-అభివృద్ధి సమపాళ్లలో అమలు చేసి పేదల్ని ధనికులుగా చేయగల సత్తా ఒక్క నారా చంద్రబాబు గారికి మాత్రమే ఉందని ప్రజాభిప్రాయం కూడా అదే అని నవరత్నాలపై జగన్ రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఆచరణలో నీటి మూటలుగా మిగిలిపోయాయి అని, జాబ్ క్యాలండర్ అని చెప్పి యువతను మోసం చేశారు అని, వారంలో సీపీఎస్ రద్దని జిపిఎస్ తీసుకువచ్చారు. చివరకు అదీ లేక నిరుద్యోగులను మోసం చేసినది జగన్మోహన్ రెడ్డి
ఈరోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు, పెన్షన్ లు కూడా వచ్చే పరిస్థితి లేదు అని. ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నిజస్వరూపం ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలం లొనే బట్టబయలైంది అని
ఈరోజు ఈ వైసీపీ వచ్చిన తర్వాత దెబ్బతిన్నటువంటి పేద బడుగు బలహీనవర్గాల కు నారా చంద్రబాబునాయుడు అయితేనే న్యాయం చేస్తారని నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రజలకు ఎప్పుడు తోడుగా నిలబడ్డాయని కాబట్టి గెలుపు మనదే అని ఇంకా ప్రజలు అమాయకులనే భ్రమలో ధీమాతో తాను ఏమి చెప్పినా నమ్ముతారనుకుంటున్నారు అని,సెంట్రల్ నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులు దాదాపు 50 వేల మంది నివసిస్తున్నారు, గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకని ఈరోజు 20,000 టూ 30,000 చేసి లోడు కొనుగోలు చేయలేక కాంట్రాక్టర్లు పనులు ఆపేయడంతో పనులు లేక నిర్మాణరంగం కుదేలు అయిపోయి భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉంటున్నారు అని తెలియజేసారు .
టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో కు సంబంధించినటువంటి హామీ జనసేన తెలుగుదేశం పాంప్లెట్లను మరియు బాండ్లను అర్హత కలిగిన ప్రజానీకానికి అందజేయడం జరిగినది.
దీనిలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15వేల రూపాయలు చొప్పున ఇవ్వడం, ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్ల నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు ఇవ్వడం, దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ప్రతి రైతుకు సంవత్సరానికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం,20 లక్షల మంది యువతకు ఉపాధి నిరుద్యోగులకు యువకులం నిధి నుంచి నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఇంటింటికి మంచినీరు పథకం, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల అండ, అలాగే పేదలను సంపన్నలను చేసే పి4 ఐదేళ్లలో కనీసం రెట్టింపు ఆదాయం గురించి పూర్ టూ రిచ్ అనే పథకాలు వంటివి వారికి వివరించడం జరిగినది అని తెలిపారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ముఖ్యమంత్రి పదవి పోయిన రోజున వెళ్లి జైల్లో కూర్చుంటాడు,మనం అడిగే వాటికి సమాధానం చెప్పుకోలేక కింద స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి పైస్తాయి నారా చంద్రబాబు నాయుడు వరకు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి ఇబ్బందులు గురి చేస్తున్నాడు అని ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ కార్యచరణను కింద స్థాయి వరకు ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలి అని ప్రతి కార్యకర్త పిలుపునివ్వాలి అని
ఈ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాన్ని పాల ద్రోళడమే నిజమైనటువంటి చంద్రబాబు నాయుడు నిజమైన కార్యకర్తలుగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోండా ఉమామహేశ్వరావు మెజారిటీ తీసుకొని రావడమే మా ధ్యేయమని అని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు . ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనితం సాంబశివరావు,డివిజన్ అధ్యక్షులు చలమల శెట్టి శ్రీనివాస్,ఇమ్మిడి రాము,దారపు నేని బాబి,నందేటి లక్ష్మణ్ సింగ్,మాధినేని రామయ్య,మద్దినేని సుబ్రమణ్యం,ఒమ్మి తిరుపతి,కొనిగినేని శ్రీనివాస్, పములపాటి ప్రసాద్,సప్ప చిన్న వెంకన్న,జనసేన నాయకులు జనసేన అద్యక్షులు యంపాటి ప్రభుజి,వాసా అనిల్ కుమార్,వాళ్లే నాగరాజు,పండలనేని గోపాల్,మారాసు రమణ,ఆళ్ల గిరీష్,పాల రజిని,బెల్లని అనిల్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.