ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన జేసీ అస్మిత్ రెడ్డి
జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి తాడపత్రి పట్టణం రెడ్డివారిపాలెం లో పర్యటించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం లో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు అందించబోయే పథకాలను వివరించి. వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.