మహిళన్యాయవాదికికోర్టులో న్యాయం జరగాలని _మేడ శ్రీనివాస్

మహిళన్యాయవాదికికోర్టులో న్యాయం జరగాలని _మేడ శ్రీనివాస్

న్యాయవాది కే. లక్ష్మి జరిగిన దాడిని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా) తీవ్రంగా ఖండిస్తుంది.

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

అనంతపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అమానుషంగా దాడి చేసి గాయపరచిన

టి. సోమశేఖర్ రెడ్డి, వడ్డే భానుమూర్తి ల పై చట్ట పరమైన కఠిన చర్యలు చేపట్టాలని ఆలా గౌరవ అధ్యక్షులు ఎస్. ఆర్ సంకు, అధ్యక్షులు ఎం వి రాజారామ్ . ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్, సెక్రిటరీ అవధానుల హరి ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వ కార్యాలయంలో ఒక మహిళా న్యాయవాదికి భద్రత లేకపోవటం బాదాకారం. దాడి చేసిన దుండుగులు పై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేసి రిమాండ్ కు తరలించాలి. న్యాయవాదులుపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించక పోవటమే దాడులకు కారణంగా భావించాలి. అనేక పర్యాయాలు సీనియర్ న్యాయవాదులు ఎస్. ఆర్ సంకు, ఎం వి రాజారామ్ నేత్రుత్వంలో న్యాయవాదుల భద్రత పైన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలతోఒక ప్రత్యేక నివేదికను సమర్పించినా ఏ విధమైన కదలికలు లేకపోవటమే ఈ తరహా దాడులకు కారణం.

రాజకీయ నాయకులకు, సమాజానికి ఏ విధమైన నష్టం ఏర్పడినా ప్రజల పక్షాన అండగా నిలిచేది న్యాయవాదులు మాత్రమే నని పాలకులు మరిచిపోతున్నారు. అలాంటిది న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు, దాడులు పట్ల పాలకులు స్పందించక పోవటం చట్ట విరుద్ధం అని వారు తెలిపారు.

న్యాయవాది కే. లక్ష్మి పై జరిగిన దాడి పట్ల ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వారు తక్షణమే స్పందించి దుండుగులు పై కఠిన చర్యలు చేపట్ట వలసినదిగా ప్రభుత్వానికి లేఖ వ్రాయాలని వారు కోరారు. ఎస్. ఆర్. సంకు,

    గౌ. అధ్యక్షులు,

  ఎం. వి. రాజారామ్,

     అధ్యక్షులు,మేడా శ్రీనివాస్ ,

    ప్రధాన కార్యదర్శి,

 అవధానుల హరి ,

కార్యదర్శి,ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)