వీరాంజనేయులు కు టిప్పర్ డ్రైవర్లు సంఘీభావం తెలిపారు

వీరాంజనేయులు కు టిప్పర్ డ్రైవర్లు సంఘీభావం తెలిపారు

.(జనచైతన్య న్యూస్) శింగనమల మండల పరిధిలోని తన సొంత గ్రామంలో సి. బండమీద పల్లిలో డ్రైవర్లు వీరాంజనేయులు కు మద్దతుగా టిప్పర్లతో సంఘీభావం తెలిపారు . ఇందులో భాగంగా శింగనమల నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు మాట్లాడుతూ ఏ డ్రైవర్ లేకుండా ఏ గమ్యాన్ని చేరుకోలేరని అన్నారు.అంతేకాకుండా నేను నిరుపేదైనా నాపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టిప్పర్ డ్రైవర్ అని విమర్శించడం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేద అయినటువంటి విద్యార్హతను చూసి అవకాశం ఇచ్చారన్నారు. అదేవిధంగా టిప్పర్ డ్రైవర్ అని కించపరిచే విధంగా వ్యాఖ్యలపై వీరాంజనేయులు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు.టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహిస్తున్నారు.మరి నీ వాహనాన్ని కూడా ఒక డ్రైవర్ ఉండాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా టిప్పర్ డ్రైవర్ అంటూ హేళన చేసినటువంటి చంద్రబాబుకు రానున్న ఎన్నికలలో ప్రజలందరూ గట్టి గుణపాఠం చెబుతారని టిప్పర్ డ్రైవర్లు అన్నారు.