వైద్యరంగంలో ఒక చరిత్ర ఘట్టం

వైద్యరంగంలో ఒక చరిత్ర ఘట్టం

వైద్యరంగంలో ఒక చరిత్ర ఘట్టం 

విజయవాడ - జన చైతన్య న్యూస్ ప్రతినిధి (టి.జి)

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో చిన్న గ్రామమైన ఏరుకోపాడులో జన్మించి,డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరావు చిన్నతనము నుండి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించి చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరావు వైద్య వృత్తిపై ఉన్న మక్కువ తో రాత్రి పగలు నిద్రాహారాలు మాని డాక్టర్ సీటు సాధించారు. డాక్టర్ పట్టా పొంది తాను జన్మించిన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని సంకల్పంతో అధునాతనమైన భవనాన్ని నిర్మించారు,ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ ప్రజల మనసుల్లో మంచి డాక్టర్ గా స్థానం సంపాదించారు. ముఖ్యంగా ఆయన వద్దకు వచ్చి న వారి నీ చిరునవ్వుతో పలకరిస్తూ ఆప్యాయతలు చూపిస్తున్నారు, అంటున్న ఆయన వద్ద వైద్య సేవలు పొందినవారు, మా డాక్టర్ దగ్గరకు వస్తే చాలు ఆయన చిరునవ్వు ఆయన పలకరింపు ఆయన మాతో మాట్లాడితే సగం వ్యాధులు తగ్గిపోతాయి అని ఆయన అభిమానుల గుండెల్లో దాగి ఉన్న మాట సార్ పది కాలాలు ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యశాల అందించాలని కోరుతున్నారు .