ఇబ్రహీంపట్నం ఆర్ డబ్ల్యూఎస్ వాటర్ పంపు హౌస్ ను పరిశీలించిన మున్సిపల్ కౌన్సిలర్లు
విజయవాడ - కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఆర్ డబ్ల్యూఎస్ వాటర్ పంపు హౌస్ ను కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు గురువారం పరిశీలించారు.గత వారం రోజులుగా కొండపల్లి ప్రాంతానికి మంచినీటి సరఫరా మోటార్లు మరమ్మతులకు గురికావడంతో తాగునీటి సరఫరా ఆటంకం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గౌరవ శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాదు దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచనల మేరకు ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు మరియు సిబ్బందితో మాట్లాడి వీలైనంత త్వరగా మోటార్లను రిపేరు చేసి తాగునీటి సరఫరా సజావుగా సాగేటట్టు చూడాలని సూచించారు. కార్యక్రమంలో కొండపల్లి వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుంజ శ్రీనివాసు, వైసీపీ నాయకులు కుమ్మరి శ్రీనివాసరావు, మోటూరి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.