పసుపు జెండాలతో దద్దరిల్లిన పుట్టపర్తి జనసంద్రంగా మారిన పుట్టపర్తి
పసుపు జెండాలతో దద్దరిల్లిన పుట్టపర్తి
జనసంద్రంగా మారిన పుట్టపర్తి
నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన టీడీపీ, జనసేన,బీజీపీ కార్యకర్తలు
అట్టహాసంగా టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి గా పల్లె కుటుంబ నామినేషన్
*వైసీపీ అధికారంలోకి వస్తే మాఫియా రాజ్యం*
*టీడీపీ వస్తె ప్రజలకు సుపరిపాలనే చంద్రన్న ధ్యేయం.*
*టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, యువ నేత పల్లె క్రిష్ణ కిషోర్ రెడ్డి*
*పుట్టపర్తి :18*
పుట్టపర్తి నియోజకవర్గ టీడీపి ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి తోపాటు యువ నేత పల్లె క్రిష్ణ కిషోర్ రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు వేర్వేరుగా నామినేషన్ పత్రాలను సమర్పించారు.
టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వేలాది మంది ప్రజలు,టీడీపీ,జన సేన , బీజీపీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో పుట్టపర్తి నగర పురవీదులన్ని పసుపు జెండాలు, జన సేన ,బీజీపీ జెండాలతో రెప రెప లాడాయి. టీడీపీ నామినేషన్ కార్యక్రమం తో పుట్టపర్తి నగరమంతా పసుపు మయమైంది. ముందుగా నామినేషన్ కార్యక్రమానికి నిర్ణయించిన కాలంలో ఉదయం 10.45 గంటలకు విచ్చేసిన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, యువ నేత పల్లె క్రిష్ణ కిషోర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి ఎనుముల పల్లి గణేష్ సర్కిల్ లో వేలాది మంది టీడీపీ ,జన సేన,బీజీపీ కార్యకర్తలు అభిమానులు పూల వర్షం కురిపిస్తూ పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి అపూర్వ స్వాగతం పలికారు. వేలాది మంది అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పుట్టపర్తికి తరలిరావడంతో ఎక్కడ చూసినా పుట్టపర్తి నగర వీధులన్నీ పసుపు మాయమయ్యాయి. నామినేషన్ పత్రాలను సమర్పించడానికి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి తో పాటు హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అయన తనయుడు పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి తో కలిసి పుట్టపర్తి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్ళారు. ముగ్గురు మూడు సెట్ల నామినేషన్లు పత్రాలను వేర్వేరుగా మధ్యాహ్నం 12.15 నిమిషాలకు సమర్పించారు.
వీరితో పాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, జన సేన పార్టీ ఇన్ ఛార్జ్ పత్తి చంద్రశేఖర్, బీజీపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ ,టీడీపీ హిందూపురం జిల్లా అధ్యక్షులు వడ్డే అంజినప్ప టీడీపీ జిల్లా నాయకులు రేస్కో మాజీ చైర్మెన్ లాయర్ రాజశేఖర్, వాల్మీకి సాధికారత కమిటీ అధ్యక్షుడు రామాంజనేయులు ,సాలెక్క గారి శ్రీనివాసులు, వడ్డేర్ల సాధికారత కమిటీ అధ్యక్షుడు పల్లపు రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటే టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పుట్టపర్తి నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే పల్లె సింధూర రెడ్డినీ టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుందామని అన్నారు. పుట్టపర్తి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని అన్నారు.మన పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నియోజకవర్గానికి ప్రధాన సమస్య పరిశ్రమలు సాగునీరు,త్రాగునీరు తీసుకరావడమే ప్రధాన లక్ష్యం అన్నారు.ఇది టీడీపీతోనే సాధ్యం అన్నారు.యువ నేత పల్లె క్రిష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో మద్యం మాఫియా, గంజాయి మాఫియా రాజ్యం కొనసాగుతోందన్నారు. వీటికి అంతం పలకాలంటే టీడీపీ ,జన సేన,బీజీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూర సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుందామని అన్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని లేదంటే సైకో సైన్యాన్ని తరిమి కొట్టకపోతే మాఫియా రాజ్యం వస్తుందన్నారు. దీనికి అంతం పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి తీసుక వచ్చేలా సైకిల్ గుర్తుకు ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రజల వద్దకు వెళ్ళి వైసీపీ పాలన తో రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ,జన సేన,బీజీపీ పార్టీల నాయకులు వలిపి
సోమ శేఖర్ , ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలే నాయక్, ఎద్దుల ప్రమోద్ రెడ్డి ,రామ్ లక్ష్మణ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సామ కోటి ఆదినారాయణ , బీజీపీ లాయర్ హరికృష్ణ ,జన సేన నాయకులు అబ్దుల్,ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి మండల కన్వీనర్లు , సర్పంచ్ లు ,ఎంపిటిసిలు , కౌన్సిలర్లు ,అన్ని మండలాల మాజీ ప్రతినిధులు,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ,సభ్యులు ,మహిళా సంఘాలు నాయకురాల్లు ముఖ్య నాయకులు మూడు పార్టీల కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు.